Posts

మాయమైన అదృష్టం

ఎపిసోడ్ 1 అది రేడియోలో వార్తలు సరిగా రావడం లేదు చూడు రాజు సరే తాత అబ్బా ఎంత కాలం అయింది రేడియోలో పాటలు విని పాటలు పెట్టు నాన్న సరే అమ్మ అది సరిగ్గా పని చేయడం లేదు అమ్మ రేడియోని రేపు నేను పక్క ఊరిలో కెళ్ళి రిపేర్ చేయించుకుని వస్తానమ్మా. నాకు 20 పైసలు ఇవ్వు. సరే రాజు ఉదయం వెళ్లి చేయించుకుని వద్దు కానీ అన్నం తిని పడుకో ఇప్పుడు మేము ఎవరో అనుకుంటున్నారా నా పేరు లక్ష్మి నా కొడుకు రాజు మా నాన్న మా జీవితంలో ఈ దీపం వెలుగు తప్ప ఇంకా ఏ వెలుగు లేదు చిన్న చిన్న ఆనందపు ఆలోచనలతో ఆనందించే మాకు అనుకోకుండా వచ్చిన దాన్ని అదృష్టం అనుకోవాలో ఇది మా కళా అనుకోవాలి అర్థం కావడం లేదు ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను

అక్షరం - నా అదృశ్య నేత్రం!

​అనంతమైన ఈ లోకాన్ని.. అరచేతిలో చూపించే మహా శక్తి అక్షరం! ​ఆకాశంలో మెరిసే నక్షత్రంలా.. ఎన్నటికీ చెరిగిపోని వెలుగు ఈ అక్షరం! చుక్కలు లేని ఆకాశం ఎలా ఉంటుందో.. అక్షరం లేని బ్రతుకు అలాగే ఉంటుంది! ​పుట్టకతోనే నవ్వులు లేని.. నా అక్షరపు నక్షత్రాల వీధిలో.. నన్ను కమ్మేసిన చీకటిని చీల్చుకుంటూ.. నాకు తోడుగా వచ్చే జాబిలి ఈ అక్షరం!

శీర్షిక: వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 9)

​.     అమ్మనాన్నలు పదేళ్ల క్రితమే చనిపోయారని, నాన్న మరణిస్తే అమ్మను కూడా అదే సమాధిలోకి బలవంతంగా పంపేశారని విన్న క్షణం నా ప్రపంచం కుప్పకూలిపోయింది. ఆ చేదు నిజాన్ని భరించలేక నేను కుమిలిపోతుండగా, ఆకాష్ గారు అక్కడికి చేరుకున్నారు. ​విలవిలలాడుతున్న నన్ను ఓదారుస్తూ, ఆయన గంభీరంగా ఊరి జనాన్ని చూసి అన్నారు.. "ఇంకెన్నాళ్లు? ఇంకెన్నాళ్లు ఈ అరాచకాలు? సమాజం ఎంతో మారిపోతోంది, కానీ ఈ ఊరు మాత్రం ఇంకా ఈ మూఢాచారాల చీకటిలోనే ఉండిపోతానంటోంది. వెలుగుతున్న కొత్త ప్రపంచాన్ని చూడలేని కళ్లు ఇవి!" ​ఆయన నా చేయి పట్టుకుని, "పదా వెన్నెలా.. నీ మనసు చంపేసిన ఈ ఊరిలో మనం ఒక్క క్షణం కూడా ఉండొద్దు" అని నన్ను నడిపించారు. వెనక్కి తిరిగిన నేను, చివరిసారిగా నా పుట్టింటి నేల మీద వంగి.. ఒక పిడికెడు మట్టిని తీసుకుని నా పిడికిలిలో గట్టిగా దాచుకున్నాను. ​నా గతాన్ని, నా అమ్మ జ్ఞాపకాన్ని ఆ మట్టి రూపంలో నా ప్రాణంగా పట్టుకుని, వెన్నెల ఆ ఊరి పొలిమేర దాటింది. మళ్ళీ ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడని ప్రయాణం వైపు.. కొత్త వెలుగుల వైపు! ​ముగిసింది.

వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 8)

ఎన్నో ఏళ్లు గడిచాయి. అమ్మనాన్నలు రావొద్దన్నారు కాబట్టి నేను వాళ్ల కోసం ఎదురుచూశాను. కానీ ఇక ఆగలేక నేరుగా ఊరికే బయలుదేరాను. ఊరికి దగ్గరవుతుంటే పచ్చని పైరు గాలి నన్ను పలకరిస్తున్నట్టు అనిపించింది. బస్సు దిగగానే మట్టి వాసన.. నేను రాకముందే వాన జల్లు కురిసి ఆ పరిమళాన్ని నా కోసం దాచినట్టుంది. ​ఊరి పొలిమేరలో బోడ్రాయి దగ్గర సిమెంట్‌తో కట్టలు కట్టారు. పాత బావి దగ్గర కొత్త గిలకలు వచ్చాయి. రోడ్లన్నీ బాగుపడ్డాయి. ఇల్లు కూడా మారిపోయాయి. గోళీలు ఆడుకున్న పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఆ ఊరి కోడళ్లుగా కొందరు, పెళ్లిళ్లు చేసుకుని పట్నం వెళ్లిన వారు కొందరు.. అంతా కొత్తగా ఉంది. మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్లు మాత్రం బాగా పెరిగి దట్టంగా మారాయి. ​పెద్దయ్య ఫోన్ ఎత్తడం లేదని నా భర్త ఆకాష్ గారు తన నెంబర్ నుండి మళ్ళీ ఫోన్ చేశారు. "పెద్దయ్య గారు, వెన్నెల ఊరికే వస్తోంది, తను వచ్చేసరికి పద్ధతులు మారాయో లేదో అని తన భయం. మీరు కొంచెం చూసుకోండి" అని చెప్పారు. అది విన్న పెద్దయ్య గారు వణికిపోతూ, "ఎందుకు బాబు పంపించావు? నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయ్!" అని కంగారుగా పరుగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. ​...

శీర్షిక: వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 7)

పట్నం వచ్చాక ఒకరోజు నేను నా భర్త ఆకాష్ గారితో మా ఊరిలో జరిగిన జ్యోతి అక్క విషాద గాథను చెప్పాను. ఆ క్రూరమైన ఆచారం, ఆ మనుషుల రాక్షసత్వం గురించి వింటుంటే ఆయన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏదో తెలియని కంగారు, పశ్చాత్తాపం ఆయన కళ్లల్లో కనిపించాయి. ​"ఎందుకు అంత కంగారు పడుతున్నారు?" అని అడిగాను. ఆయన చెప్పిన మాట విన్నాక నా గుండె ఆగిపోయినంత పని అయింది. ​"వెన్నెలా... జ్యోతి అక్క భర్త దినపత్రికలు చదివేవారన్నావు కదా! ఆ రోజుల్లో నేను సామాజిక మార్పు కోసం పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాసేవాడిని. నా రాతలు చదివిన ఎవరో ఒకరు నాకు తరచూ ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలకు సమాధానంగా నేను కూడా ఎన్నో సూచనలు పంపేవాడిని. సామాజిక అరాచకాలపై గళమెత్తమని, మూఢాచారాలను ఎదిరించమని నేను రాసిన ఆ అక్షరాలే ఆయనను ప్రభావితం చేశాయి. ఆ అక్షరాలే ఆయనలో తెగింపును నింపాయి. చివరకు నా మాటలే ఆయన ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయా?" అంటూ ఆయన కుమిలిపోయారు. ​నా అక్షరాలే ఆయనను మృత్యువు ఒడికి చేర్చాయన్న నింద ఆయన మనసును తొలిచేస్తోంది. అటు జ్యోతి అక్కను కోల్పోయిన ఊరి జ్ఞాపకం, ఇటు తన రాతల వల్లే ఇదంతా జరిగిందన్న భర్త ఆవేదన... నా చుట్టూ ...

వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 6)

పుట్టింటి గడప దాటి పట్నం చేరాను. అప్పట్లో మా ఊర్లో ఒకే ఒక ఫోన్ ఉండేది. ఊరి పెద్దయ్య కొడుకు పట్నం నుండి పంపించారంట ఆ ఫోన్. అమ్మ నాతో మాట్లాడాలని అన్నోసార్లు ఆ ఫోన్ ద్వారా ప్రయత్నించేది. ఫోన్ కలిసినప్పుడల్లా అమ్మ గొంతు వింటే ప్రాణం లేచి వచ్చేది. ​గర్భం దాల్చడానికి కూడా సిద్ధంగా లేని ఈ పసి ప్రాణానికి ఎందుకు పెళ్లి చేశారంటే.. ఆ ఊరిలో అంత ప్రమాదం పొంచి ఉందని నా భర్త, అత్తయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను. అప్పుడే నాకు అర్థమైంది, అమ్మనాన్నలు నన్ను వదిలించుకోవడానికి కాదు, నా క్షేమం కోసమే గుండెను రాయి చేసుకుని పట్నం పంపించారని. అదృష్టవశాత్తూ నా అత్తమామలు నన్ను కోడలిలా కాకుండా కన్నకూతురిలా చూసుకున్నారు. ​కొన్ని రోజులకి నేను గర్భవతినయ్యాను. ఒక బిడ్డకు తల్లిని కాబోతున్నానన్న వార్త తెలియగానే ముందుగా అమ్మ గుర్తొచ్చింది. "అమ్మా! నేను తల్లిని కాబోతున్నాను, నేను ఊరికి వచ్చేస్తాను అమ్మా!" అని ఫోన్లో ఆరాటపడ్డాను. కానీ అమ్మ మాత్రం "వద్దు తల్లి, నువ్వు రావడం వద్దు, మేమే పట్నం వస్తాం" అని చెప్పింది. ​ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. అమ్మతో మాట్లాడదామని ఫోన్ చేస్తే పెద్దయ్య ఫోన్ ఎత్తడం లేదు. ఎ...

వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 5)

పెళ్లి అంటే పూర్తిగా తెలియని వయసు అది. కానీ అమ్మనాన్నలు నా క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని నా చిన్న ప్రాణానికి అర్థమైంది. రేపు తెల్లవారితే నా పెళ్లి. ఆ రాత్రంతా ఆ చిన్న ఊరు ఊరంతా నా పెళ్లి పనుల్లో సందడిగా ఉంది. ఆ ఊరి జనం నాపై చూపించే ప్రేమాభిమానాలు ఆ రోజే నాకు పూర్తిగా తెలిశాయి. ​ఉదయాన్నే నా చిన్ని చేతులు, కాళ్లు పసుపు పారాణితో మెరిసిపోతున్నాయి. పందిరిలో పచ్చని పండు వెన్నెలకు బొట్టు పెట్టినట్టున్న నా ముఖం చూసి అమ్మ దిష్టి తీసింది. నా చిన్న చిరునవ్వు చూసి అమ్మ ఆనందం రెట్టింపైంది. అందరూ అక్షింతలు వేసి దీవించారు. పెళ్లి కొడుకు తరపు వారు వచ్చారు. నా జీవితాన్ని మలుపు తిప్పి, నా చేత శాసించబడుతున్న నా భర్త ఆకాష్ గారు నా మెడలో మూడు ముళ్లు వేశారు. అవును, ఆరోజు వచ్చిన ఆ పెళ్లి కొడుకే.. ఇవాళ నన్ను మళ్లీ నా సొంత ఊరికి పంపించారు. ​తెల్లవారుజామున పెళ్లి జరిగిపోయింది. అందరి నవ్వులు, సంతోషాల మధ్యే.. నేను నా పుట్టింటిని వదిలి వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. నా బట్టలు ఉన్న ఇనుప పెట్టెను నాన్న మోస్తుంటే, ఒడి బియ్యం పట్టుకుని అమ్మ నాతో నడిచింది. పుట్టింటి గడపకు బొట్టు పెట్టి, నా కన్నీళ్లతో ఆ గడపను కడ...