అక్షరం - నా అదృశ్య నేత్రం!
అనంతమైన ఈ లోకాన్ని..
అరచేతిలో చూపించే మహా శక్తి అక్షరం!
ఆకాశంలో మెరిసే నక్షత్రంలా..
ఎన్నటికీ చెరిగిపోని వెలుగు ఈ అక్షరం!
చుక్కలు లేని ఆకాశం ఎలా ఉంటుందో..
అక్షరం లేని బ్రతుకు అలాగే ఉంటుంది!
పుట్టకతోనే నవ్వులు లేని..
నా అక్షరపు నక్షత్రాల వీధిలో..
నన్ను కమ్మేసిన చీకటిని చీల్చుకుంటూ..
నాకు తోడుగా వచ్చే జాబిలి ఈ అక్షరం!
Comments
Post a Comment