ప్రకృతి - ప్రాణదాత

ప్రాణానికి ఊపిరి పోస్తున్నా..
నీ కష్టానికి చల్లని నీడనవుతున్నా!
నువ్వు వదిలే చెడును పీల్చుకుని..
నీకు మంచిని ఇచ్చే ప్రాణవాయువును నేను!
​ఎదిగే కొద్దీ వదగడం రాని నీకు..
సాయమై నిలిచి, అందమైన రూపంతో నీ కళ్ళను నవ్విస్తా!
బాధలో ఉన్న నీ బంధాలకు ఆసరాగా నిలిచి..
నిన్ను మోసుకుపోతా, నీకు తోడై ఉంటా!
​రూపం లేదని నా దయను మరువకు..
స్వార్థంతో నన్ను అంతం చేయకు..
నన్ను చంపకు.. నేను నీ ప్రాణాన్ని!

Comments

Popular posts from this blog

మౌనం - మనసు అలజడి

అమ్మ - అనంత రూపం

అక్షరం - నా అదృశ్య నేత్రం!