వెనక్కి తిరిగిన వెన్నెల ఎపిసోడ్ 1

 నా కూతురు సిరి ఇప్పుడే కాలేజీ నుండి వచ్చింది. ఇంట్లోకి వస్తూనే నా ముఖం చూసి ఆశ్చర్యంగా అడిగింది— "ఏంటమ్మా.. నీ ముఖంలో ఈరోజు కొత్త వెలుగు కనిపిస్తోంది, విశేషం ఏంటి?" అని.

​వెనుకనే నవ్వుతూ వచ్చిన తన నాన్న ఆకాష్ గారు అందుకున్నారు.. "మీ అమ్మ 25 ఏళ్ల తర్వాత తన పుట్టింటికి వెళ్తోంది సిరి, ఆ సంతోషం అలా కనిపిస్తోంది!" అని.

​అవును, ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదా? నా పేరు వెన్నెల. నా భర్త ఆకాష్, నా ప్రాణం నా కూతురు సిరి. పాతికేళ్లుగా నా సొంత ఊరికి, ఆ మట్టికి ఎందుకు దూరంగా ఉన్నానో చెప్పడానికి చాలా కారణాలే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఒక్క మాటలో చెప్పలేను.

​"వెళ్లి వస్తాను సిరి.. జాగ్రత్త! నేను తిరిగి వచ్చాక నా సొంత మట్టి గురించి, నా గతం గురించి నీకు, మీ నాన్నకు అన్నీ వివరిస్తాను" అని చెబుతూ భారమైన హృదయంతో, అంతే ఉత్సాహంతో ప్రయాణమయ్యాను.

​నా ఈ ప్రయాణాన్ని మీతో పంచుకుంటాను. కానీ ఈ కథ ఇప్పుడు  కాదు ఎప్పుడో మొదలైంది? ఆ రోజు ఏం జరిగింది? అనేది.. వచ్చే ఎపిసోడ్‌లో చెబుతాను.

Comments

Popular posts from this blog

మౌనం - మనసు అలజడి

అమ్మ - అనంత రూపం

అక్షరం - నా అదృశ్య నేత్రం!