స్నేహం - ప్రాణవృక్షం
సృష్టించలేని రూపం.. స్నేహం!
చీకటిలో వెన్నెలలు కాచే వింత వెలుగు మన బంధం.
కాలం చూపిన ఈ ప్రాణానికి.. ఆయువు పోసే వృక్షం!
వసంతాలు ఎన్ని మారినా..
ఈ చెలిమిని మించిన వసంతం మరొకటి లేదు.
మరణం వరకు వీడని నీడలా..
మనసుని తాకే మధుర కావ్యం ఈ స్నేహం!
Comments
Post a Comment