ఆశ - ఆకాశ శిఖరం​

రేపు అనేది నీకు లేని నాడు.. నిన్ను నువ్వు ఓదార్చుకో!
వెలుతురు నీ తనువును తాకినంత కాలం..
నీలో ఉన్న నిన్ను నువ్వు కోల్పోకు!
​బతుకును బతికించే ఆశ.. రేపటి కోసం కలలు కంటుంది.
నిశీధి కాంతి కరిగిపోక తప్పదు..
పుడమి పురుడు పోసుకునే సమయానికి,
ఆ వెచ్చని కాంతి నిన్ను తాకక తప్పదు!
​ఆశలను అంతం చేయకు..
ఆశ లేని ఆనాడు ఉండి ఉంటే..
ఆకాశానికి ఈనాడు ఎగరలేకపోయేవాళ్ళమేమో!

Comments

Popular posts from this blog

మౌనం - మనసు అలజడి

అమ్మ - అనంత రూపం

అక్షరం - నా అదృశ్య నేత్రం!