వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 2)
సొంతూరికి వెళ్లే బస్సు కోసం బస్టాప్‌లో ఎదురుచూస్తున్నాను. బస్సు ఇంకా రాలేదు కానీ, నా కళ్ళ ముందు మాత్రం పాతికేళ్ల నాటి దృశ్యం కదలాడుతోంది.
అమ్మ చేయి పట్టుకుని ఏడుస్తూ వెళ్తున్న ఒక చిన్న పాప.. "అమ్మా నన్ను పంపకు అమ్మా.. నీతోనే ఉంటాను అమ్మా!" అంటూ ఆ పాప అరుస్తున్న అరుపులు నా చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. ఆ రోజు నేను కూడా మా అమ్మను అలాగే ప్రాధేయపడ్డాను. ఆ జ్ఞాపకాల్లో ఉండగానే బస్సు హారన్ కొడుతూ నా ముందు ఆగింది.
మొత్తానికి బస్సు ఎక్కాను. మనసంతా ఏదో తెలియని ఆందోళన, మరోపక్క అనందం. అది నా సొంత ఊరు.. నేను నడిచిన నేల. పసితనంలో నాకు తినాలనిపించిన కమ్మని మట్టి నేల అది. వాన వస్తే వచ్చే ఆ మట్టి వాసన నాకెంతో ఇష్టం. అందరి ప్రేమానురాగాల మధ్య 12 ఏళ్ల వరకు నా బాల్యం ఎంతో అద్భుతంగా గడిచింది.
కానీ వయసు పెరుగుతున్న కొద్దీ లోకం కొత్తగా అనిపించింది. నా కళ్ళు, మనసు చుట్టూ జరుగుతున్న నిజాలను చూడటం మొదలుపెట్టాయి. సమాజంలో ఉండే పద్ధతులు, ఆచారాలు అప్పుడప్పుడే నాకు అర్థమవుతున్న సమయం అది. సరిగ్గా అప్పుడే నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన జరిగింది. ఆ రోజు జరిగిన విషయాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను.
అసలు ఆ పన్నెండేళ్ల ప్రాయంలో వెన్నెల జీవితంలో జరిగిన ఆ చేదు సంఘటన ఏమిటి?
వచ్చే ఎపిసోడ్‌లో...
Comments
Post a Comment